రాష్ట్ర బార్‌‌ కౌన్సిల్‌‌ కు 23 మంది సభ్యుల ఎన్నిక పూర్తి

రాష్ట్ర బార్‌‌ కౌన్సిల్‌‌ కు 23 మంది సభ్యుల ఎన్నిక పూర్తి
  • త్వరలోనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక!

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర బార్‌‌ కౌన్సిల్‌‌కు జరిగిన ఎన్నికల పూర్తి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గత నెల 10న ప్రారంభం కాగా.. సుదీర్ఘ లెక్కింపు అనంతరం 23 మంది సభ్యులు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలను  హైకోర్టు మాజీ న్యాయమూర్తి యతిరాజులు నేతృత్వంలోని కమిటీ నిర్వహించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ ఎన్నిక కాకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో పొన్నం అశోక్‌‌గౌడ్ విజయం సాధించారు. 

మహిళా రిజర్వేషన్ల కింద సీహెచ్‌‌.భానుచంద్రిక, సీహెచ్‌‌.శైలజ, ఎస్‌‌.పరిపూర్ణ, పి.సుజాత, బి.సునిత ఎన్నికయ్యారు.  పొన్నం అశోక్‌‌గౌడ్ తర్వాత ఎన్నికైన మరో 23 మంది సభ్యుల నుంచి త్వరలోనే  బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఆలిండియా బార్ కౌన్సిల్ సభ్యుడిని ఎన్నుకోనున్నారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎక్స్‌‌అఫిషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు. ఇద్దరు మహిళలను కోఆప్షన్ సభ్యులుగా ఎంపిక కానున్నారు.