లెటర్​ టు ఎడిటర్..భాష కాదు,నీతి ముఖ్యం

లెటర్​ టు ఎడిటర్..భాష కాదు,నీతి ముఖ్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్​ రెడ్డి భాష గురించి ఒక అనవసర సంవాదం ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఆయన భాషను ఎద్దేవా చేస్తూ స్క్రోలింగ్ చేయడం సరికాదు. ఆ మాటకొస్తే ఎవ్వరి భాషైనా వారు పుట్టి పెరిగిన, నేర్చుకున్న పరిసరాలను బట్టి వస్తుంది. ఈ మాత్రం అవగాహన లేని పింకీలు ముఖ్యమంత్రిని అవమానపర్చడం సభ్యత కాదు. ప్రతి మనిషి మనసులో మూడు రకాల వలయాలు లేదా చక్రాలు లేదా స్థితులు ఉంటాయి. వాటిలో ఒకటి నైతికత.

దానినే మనం నీతి, నిజాయతీ అంటాం. ఇక రెండవది పర్సనాలిటీ అభివృద్ధి. గుణగణాలు, మంచి చెడు, సమస్యల్ని పరిష్కరించే శక్తి, ఇతర శక్తి సామర్థ్యాలు మొదలగునవి. ఇక చివరిది భాష. ఈ మూడు లక్షణాల్లో బీఆర్ఎస్ నాయకుల, కార్యకర్తల, పార్టీ పెద్దల, ప్రభుత్వ పెద్దల్లో మొదటి అంశం బాగా లోపించింది. వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్, భాష నైపుణ్యాలు బాగా ఉన్నాయి. నీతిలేని పర్సనాలిటీ డెవలప్మెంట్, భాష నైపుణ్యాలు వృథా అని చెప్పవచ్చు. నీతి బాహ్యంగా గత దశాబ్దంలో వాళ్ళు తెలంగాణలో చేసిన పెంట అంతా ఇంతా కాదు. ఇచ్చిన మాటలు

చేసిన దుర్మార్గం, చిల్లర మల్లర కథలు అదంతా మరిపించడానికి ముఖ్యమంత్రి విషయంలో తప్పు పట్టడం వారి అభద్రతను, అస్థిరతను, మోస పూరిత బుద్ధిని తెలంగాణ ప్రజల గుర్తిస్తున్నారు. భాష పుట్టుకతో వచ్చే గొప్ప నైపుణ్యం ఏమీ కాదు. మనం చెప్పదలుచుకున్న భావాన్ని ఏదైనా ఒక భాషలో స్పష్టంగా చెప్పగలిగితే చాలు. నిజానికి భావవ్యక్తీకరణకు మాత్రమే భాష అవసరం. వ్యక్తీకరణ సరిగ్గా జరిగిందా, చెప్పదలుచుకున్నది చెప్పామా అన్నది సరిపోతుంది. అన్ని భాషలు నేర్చుకోవడం ఎవ్వరి తరమూ కాదు. కానీ పరిపాలించే సమర్థత, నిర్ణయాలు తీసుకునే ధైర్యం, ప్రజల పట్ల సహృదయం ఉండాలి. కేసీఆర్​లాంటి  నియంతను చిత్తు చేసిన   ఘనత రేవంత్ రెడ్డిదే. 

- కె.  శ్రీనివాసాచారి,రాజకీయ, మనో విశ్లేషకుడు