హైదరాబాద్‏లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‏లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు నిర్వహించారు. ‘జయజయహే తెలంగాణ’ అంటూ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. 

హైదరాబాద్ కలెక్టరేట్‎లో ప్రియాంక ఆల, హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏలో జాయింట్ కమిషనర్​శ్రీవత్స కోట, వాటర్​బోర్డులో ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణన్, సీఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ సృజన, ఎంఎంసీలో  కమిషనర్  వినయ్ కృష్ణా రెడ్డి, హైడ్రా ఆఫీసులో అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య జాతీయ జెండాలను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎల్పీ స్టేడియంలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ శివసేనారెడ్డి , ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. – వెలుగు నెట్​వర్క్​