
- రాష్ర్టంలో పలువురు ఉన్నతాధికారులు బదిలీ.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు : బీసీ గురుకులాల సెక్రటరీగా 2005 బ్యాచ్ఐఎఫ్ఎస్ అధికారి సైదులును రాష్ట్ర సర్కారు నియమించింది. ఆయన ఇప్పటివరకు చార్మినార్ సర్కిల్ సీసీఎఫ్‌గా పనిచేశారు. రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ, కమిషనర్‌గా 2008 బ్యాచ్‌కు చెందిన డీఐజీ తఫ్సీర్ఇక్బాల్ను నియమించింది.
ఇప్పటి వరకు ఈ పోస్ట్‌లో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ఉమర్ జలీల్‌ను రిలీవ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీఐజీగా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అదే పదవిలో కొనసాగుతారని తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్‌గా ఉన్న అనితా రాంచంద్రన్‌కు సెర్ప్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న పీఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం రిలీవ్ చేసింది.
గురుకుల నియామక బోర్డులో సైదులు సీనియర్ కావడంతో ఆయన గురు కుల బోర్డు చైర్మన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, బీసీ గురుకులాల సెక్రటరీగా పోస్టిం గ్ పొందిన సైదులు నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకులంలో చదవడం విశేషం.