యాదాద్రి గురించి చెప్పడమే తప్ప నిధులిచ్చారా?

యాదాద్రి గురించి చెప్పడమే తప్ప నిధులిచ్చారా?
  • ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 

కరీంనగర్: జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన బీజేపీ నాయకుల మాటలే తప్ప తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. యాదాద్రి గురించి గొప్పగా చెప్పిన మీరు ఏమన్నా నిధులు ఇచ్చారా ? అని ప్రశ్నించారు. కంచర్లపాలెం సినిమా దాడి లాగా దేశంలోని నాయకులను హైదరాబాద్ కు తీసుకువచ్చి మాట్లాడించారని ఆయన మీడియా సమావేశంలో విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడారని ప్రస్తావిస్తూ.. యూపీ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న పథకాలు ఒక్కటైన ఉన్నాయా ? అని బాలకిషన్ ప్రశ్నించారు. బీజేపీ సభలతో కేసీఆర్ ను అవమానం పరిచేలా మాట్లాడటం తప్ప ఒరిగిందేమి లేదన్నారు. మతం పేరిట శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని, కాకుల్లా కావ్ కావ్ అనడం తప్ప తెలంగాణకు ఏమి చేసింది లేదన్నారు.