జూన్ 21 నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీలు

జూన్ 21 నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ పోటీలు

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11వ రాష్ట్ర స్థాయి షూటింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లు ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు గచ్చిబౌలిలోని సాట్స్‌‌‌‌ షూటింగ్ రేంజ్‌‌‌‌లో జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1250 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. ఈసారి టోర్నీలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిసారిగా, 50 మీ. రైఫిల్ ప్రోన్, 25 మీ. పిస్టల్ వంటి పలు విభాగాలలో యువతకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నారు. 

జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఏఐ) సహకారంతో పోటీలకు కనీస అర్హత స్కోర్లను కూడా తగ్గించారు. వర్ధమాన క్రీడాకారులు సులభంగా పోటీ స్థాయి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కూడా అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 22, 23న 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌, 22 నుంచి 24 వరకు 25 మీటర్ల పిస్టల్‌‌‌‌, 25న 50 మీటర్ల పిస్టల్‌‌‌‌, 25, 26న 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌, 27 నుంచి 29 వరకు 50 మీటర్ల రైఫిల్‌‌‌‌ పోటీలు జరుగుతాయి.