బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు.. ఒకటి బలహీనం.. మరొకటి ఏర్పడుతుంది

బంగాళాఖాతంలో రెండు ఆవర్తనాలు.. ఒకటి బలహీనం.. మరొకటి ఏర్పడుతుంది

వర్షాలు.. ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా వానాకాలంలో వానలు పడటం లేదు. దీంతో జనం అంతా ఆకాశం వైపు చూస్తున్నారు. మేఘాలు వస్తున్నాయి.. పోతున్నాయి వాన మాత్రం పడటం లేదు. ఇలాంటి టైంలో విశాఖ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. 

ఈశాన్య  బంగాళాఖాతంలో ఆవర్తనము ఒకటి ఏర్పడిందని.. ఇది సముద్ర మట్టంకి నాలుగున్నర కిలోమీరట్ల ఎత్తులో కేంద్రీకృతం అయ్యి ఉందని స్పష్టం చేసింది. ఈ ఆవర్తనం దక్షిణ ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టానికి మూడు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వివరించింది విశాఖ వాతావరణ శాఖ. 

ప్రస్తుత వాతావరణ మార్పులతో.. ఉత్తర బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 3వ తేదీన మరో ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వెల్లడించింది విశాఖ వాతావరణ శాఖ. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం బలపడినట్లయితే వర్షాలు బాగా పడతాయని తెలిపింది. ఇది బలపడేదీ లేనిది మరో రెండు రోజుల్లో స్పష్టం అవుతుందని వివరించింది.

ఈ ఆవర్తనాల ప్రభావంతో... ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొంది. ఈ ఆవర్తనం నుంచి ద్రోణి ఒకటి దక్షణ ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిందని సూచించింది. 

నిన్నటి(ఆస్టు 31)  కోస్తా ఆంధ్రకు దగ్గర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ ఆవర్తనము ఈరోజు(సెప్టెంబర్ 01) బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరొక ఆవర్తనం ఒకటి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 3వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.

ఈ ప్రభావంతో ఈరోజు(సెప్టెంబర్ 01) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ రేపు(సెప్టెంబర్ 02) చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. ఎల్లుండి(సెప్టెంబర్ 03) అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈరోజు, రేపు(సెస్టెంబర్ 01,02) రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఎల్లుండి(సెప్టెంబర్ 03) కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

ఈరోజు (సెప్టెంబర్ 01) ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ  ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.