తెలంగాణకు.. రూ. 1533.64 కోట్ల నిధులు విడుదల

తెలంగాణకు..  రూ. 1533.64 కోట్ల నిధులు  విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: పన్నుల్లో పంపిణి వాటా కింద నవంబర్ నెలకు గాను తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,533. 64 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. సాధారణంగా ప్రతి నెల 10 వ తేదిన ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈసారి మూడు రోజుల ముందుగానే పన్నుల్లో పంపిణి వాటాలను రాష్ట్రాలకు రిలీజ్ చేసినట్లు చెప్పింది. పండుగ టైంలో ముందస్తు నిధుల విడుదల రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తోందని అభిప్రాయపడింది.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని 28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 72, 961. 21 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇందులో ఏపీ కి రూ. 2, 952. 74 కోట్లు కేటాయించింది. అత్యధికంగా యూపీకి రూ. 13088. 51 కోట్లు రిలీజ్ చేసింది. తర్వాతి స్థానంలో బిహార్(రూ.7338.44 కోట్లు), మధ్య ప్రదేశ్ (రూ.5727.44 కోట్లు), వెస్ట్ బెంగాల్ (రూ.5488.88 కోట్లు), రాజస్థాన్ (రూ. 4396.64 కోట్లు), కర్నాటక (రూ. 2660.88 కోట్లు), గుజరాత్ (రూ.2537. 59 కోట్లు), జార్ఖండ్ (రూ. 2412.83) కోట్లు రిలీజ్ చేసింది.