ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

ఉక్రెయిన్ లో చిక్కుకున్న  తెలంగాణ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్టకు చెందిన ఇద్దరు  స్టూడెంట్స్ ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. మెడిసిన్ చేయడం కోసం మూడేళ్ల క్రితం గంజి భానుప్రసాద్, శేషఫణిచంద్ర ఉక్రెయిన్ వెళ్లారు. ఇండియా రావటం కోసం విద్యార్థులు కీవ్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే ఎయిర్ పోర్టును రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోవటంతో జాఫ్రోజీ కాలేజీకి వెళ్లారు విద్యార్థులు. భానుప్రసాద్, శేషఫణిచంద్రలను స్వదేశానికి రప్పించాలని వారి తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.  యాదగిరిగుట్టలోని, శ్రీరామ్ నగర్  కు చెందిన గంజి సూర్యనారాయణ.. సంధ్య దంపతుల కుమారుడు గంజి భానుప్రసాద్.. 2019 లో మెడిసిన్ చదువు కోసం ఉక్రెయిన్ వెళ్ళాడు. మరో విద్యార్ధి శేష  ఫణి చంద్ర ..రామకృష్ణ,రత్నదీపల కుమారుడు. ఇతడు 2017లో  మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్ళాడు. ఉక్రెయిన్ లోని జాఫ్రజియా యూనివర్సిటీ లో వీరు  వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా: బోధన్ కు చెందిన వినయ్ ఉక్రెయిన్ లో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్ లో వినయ్ MBBS థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. నరేందర్, సంధ్యా రాణిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వినయ్ ను MBBS చదివించేందుకు 2019 లో ఉక్రెయిన్ కు పంపించారు తల్లిదండ్రులు. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వినయ్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వినయ్ ను స్వదేశానికి తీసుకరావాలని అధికారులను వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న ఉక్రెయిన్