
హైదరాబాద్: 51వ జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్ నిత్య సాగి గోల్డ్ మెడల్‌తో మెరిసింది. బుధవారం జరిగిన గ్రూప్–1 విమెన్స్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో నిత్య 2:21.56 సెకన్ల టైమింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.
నైషా (కర్నాటక, 2:23.68 సెకన్లు), ప్రమితి జ్ఞానశేఖరన్ (తమిళనాడు, 2:26.55 సెకన్లు) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. గ్రూప్–2 విమెన్స్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణకు చెందిన శివాని కర్ర (2:30.34 సెకన్లు) మూడో ప్లేస్‌లో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. అన్వి దేశ్వాల్ (మహారాష్ట్ర, 2:29.20 సెకన్లు), ఒవీయా (తమిళనాడు, 2:29.66 సెకన్లు) వరుసగా గోల్డ్, సిల్వర్ గెలుచుకున్నారు.