ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు : ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళ వారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్లు డాక్టర్పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ఆయా శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, కొత్తగూడెంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, మెప్మా మహిళా సహాయక సంఘాల సభ్యులు సాబేర, భారతి, ప్రవల్లిక, స్వరూప, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కొడారు సుజాత, మెప్మా పీడీ రాజేష్, స్వయం సహాయక సంఘ సభ్యు లు తదితరులు విగ్రహాలను ఆవిష్కరించారు.

