శ్రీవల్లి రష్మికకు సిల్వర్

శ్రీవల్లి రష్మికకు సిల్వర్

హైదరాబాద్, వెలుగు: గోవాలో జరుగుతున్న నేషనల్ గేమ్స్‌‌‌‌లో తెలంగాణ టెన్నిస్ ప్లేయర్​ శ్రీవల్లి రష్మిక మూడో మెడల్ సాధించింది. విమెన్స్ సింగిల్స్‌‌‌‌లో ఆమె సిల్వర్ గెలిచింది. ఆదివారం జరిగిన  ఫైనల్లో రష్మిక 5–7, 6–7 (3)తో గుజరాత్‌‌‌‌కు చెందిన టాప్ సీడ్ వైదేహీ చౌదరి చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందింది. రష్మిక ఇప్పటికే డబుల్స్ లో సిల్వర్, టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో బ్రాంజ్ గెలిచింది.