ఎల్పీజీ డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కనీస వేతనాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఎల్పీజీ డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  కనీస వేతనాలు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • అసంఘటిత కార్మికులందరికీ సంక్షేమ బోర్డులు, సమగ్ర భద్రత: మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి
  •     గత ప్రభుత్వం కార్మికుల హక్కులు, మినిమమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేజెస్ పై కనీస ఆలోచన చేయలే
  •     ఐటీఐలు, పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆధునీకరణతో గ్లోబల్ ఉద్యోగాలు
  •     సాంకేతిక విద్యను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నమని వెల్లడి

 హైదరాబాద్, వెలుగు: ఎల్పీజీ డెలివరీ బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనీస వేతనాల (మినిమమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేజెస్)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. వేతనాలతో పాటు ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ, పీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి చట్టబద్ధమైన హక్కులు దక్కేలా కార్మిక శాఖ ద్వారా అత్యవసర ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు.   రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలిండర్ల డెలివరీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్పష్టం చేశారు.  కేవలం గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ కార్మికులే కాకుండా, హమాలీలు, గృహ కార్మికులు (హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వంటి విభిన్న వర్గాల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధానాలకు స్వస్తి పలికి, అన్ని రంగాల శ్రామికులకు సమగ్ర రక్షణ కల్పించేలా కార్మిక శాఖను నడిపిస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో జరిగిన తెలంగాణ కుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6వ మహాసభకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తే పరిశ్రమలు, ఏజెన్సీలు నడవవనే యాజమాన్యాల వాదనను ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించబోదని, శ్రామికులకు తగిన ప్రతిఫలం లభించినప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రామిక వర్గం పక్షానే నిలుస్తుందని, కార్మికుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం కార్మికుల గురించి కనీస ఆలోచన చేయలేదని మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  విమర్శించారు. తన తండ్రి, మాజీ కేంద్ర కార్మిక మంత్రి కాకా వెంకటస్వామి ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగ కార్మికుల కోసం చరిత్రాత్మక ‘పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకం’ తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని, ఆ స్ఫూర్తితోనే నేడు తాము పనిచేస్తున్నామని గుర్తుచేశారు. రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా శ్రామికులకు భరోసా కల్పించేలా రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ను రూపొందించి అమలులోకి తెచ్చామని వివరించారు. 

నిరుద్యోగ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సాంకేతిక విద్యను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐలను ‘అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ సెంటర్లు’ (ఏటీసీ)గా తీర్చిదిద్దామని తెలిపారు. అత్యాధునిక రోబోటిక్స్, ఏఐ, ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టామని వివరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మన విద్యార్థులకు  ‘టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో జర్మనీ వంటి విదేశాల్లో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వార్షిక వేతనాలతో ఉద్యోగాలు లభించేలా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. పాలిటెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మౌలిక వసతుల కల్పన కోసం శక్తి శాఖ తరఫున  రూ.600 కోట్లను కేటాయించామని, శిక్షణా కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ.2 వేల స్టైపెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అందిస్తున్నామని తెలిపారు.  

 లక్ష ఉద్యోగాలు పూర్తి చేసే దిశగా వెళ్తున్నం

 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ ఇచ్చిన 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీని నిలబెట్టుకునే దిశగా ఇప్పటికే దాదాపు లక్ష ఉద్యోగాల నియామక ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామని మంత్రి పేర్కొన్నారు. కార్మిక శాఖ చిన్న శాఖ అనే భావనను తుడిచిపెట్టి, రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. కనీస వేతనాల అమలు విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థల తనిఖీలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.