హాస్పిటల్స్‌కు చెల్లించే ఆరోగ్య శ్రీ ప్యాకేజీ మొత్తంలో సుమారు 80 శాతం రివాల్వింగ్ ఫండ్‌ను హాస్పిటల్ డెవలప్‌మెంట్ కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అకౌంట్‌లో జమ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని చికిత్సలో పాల్గొన్న టీమ్‌కు పంచుతారు. ఇందులో ప్రధాన వాటా సర్జరీ చేసిన సివిల్ సర్జన్స్, స్పెషలిస్ట్ డాక్టర్‌కు వెళ్తుంది.
మిగిలిన మొత్తాన్ని అనస్థీషియా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, క్లాస్- 4 ఎంప్లాయిస్‌కు నిర్ణీత నిష్పత్తిలో పంచుతారు. ఇన్నాళ్లూ నిధుల కొరతతో ఈ ఇన్సెంటివ్స్ అందక డాక్టర్లలో నిరుత్సాహం ఉండేది. ఇప్పుడు నెలనెలా నిధులు వస్తే.. ఇన్సెంటివ్స్ టైమ్‌కు అందుతాయని, తద్వారా పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.

