టెన్త్ ఫెయిల్ స్టూడెంట్లకు రెమిడియల్ క్యాంప్లు..పీఎంశ్రీ స్కూళ్లలో మే 12 నుంచి ప్రారంభం

టెన్త్ ఫెయిల్ స్టూడెంట్లకు రెమిడియల్ క్యాంప్లు..పీఎంశ్రీ స్కూళ్లలో మే 12 నుంచి ప్రారంభం
  • అడ్వాన్స్​డ్ ​సప్లిమెంటరీలో పాస్ చేయించడమే లక్ష్యం 
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేయించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గవర్నమెంట్​స్కూళ్లలో చదివి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిలైన వారి కోసం పీఎంశ్రీ స్కూళ్లలో ఈ నెల 12 నుంచి రెమిడియల్ క్యాంప్​లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ లో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో స్టూడెంట్లు ఉత్తీర్ణత సాధించేలా ఈ శిబిరాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

33 జిల్లాల్లో 66 క్యాంప్​లురెమిడియల్ క్యాంప్​లను ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 2 పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్వహించనున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 66 క్యాంప్​లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో చదివి ఫెయిలైన విద్యార్థులకు చాన్స్ ఇవ్వనున్నారు. వీరందరికీ ఈ నెల 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుంది. సబ్జెక్టుల వారీగా నిపుణులైన టీచర్లతో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయిస్తూ వారిని పరీక్షలకు సిద్ధం చేయనున్నారు. ఈ క్యాంప్​లకు హాజరయ్యే స్టూడెంట్లందరూ జూన్ లో జరిగే అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు కచ్చితంగా హాజరయ్యేలా చూడాలని స్కూల్​ఎడ్యుకేషన్​డైరెక్టర్​డీఈవోలకు ఆదేశాలిచ్చారు.

ఒక్కో విద్యార్థికి రూ.1,100 ఖర్చు

శిక్షణ కాలంలో విద్యార్థులకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.1,100 చొప్పున నిధులు కేటాయించింది. ఈ డబ్బుల్లో రూ.100 స్టేషనరీ(పుస్తకాలు, పెన్నులు) కోసం, మిగతా రూ.1,000 విద్యార్థుల టిఫిన్, ప్రయాణ ఖర్చులు, ఇతర అవసరాల కోసం వెచ్చించనున్నారు. ఈ క్యాంప్​ల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి, అకాడమిక్ పనితీరును మెరుగుపరచడమే విద్యాశాఖ ప్రధాన ఉద్దేశమని డైరెక్టర్​పేర్కొన్నారు.