మరో ఐదు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

మరో ఐదు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో  మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జులై 21న భారీ వర్షాలు.. 22, 23 న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

జులై 21న  కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాలలో  అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

జులై 22న  భారీ నుంచి అతి భారీవర్షాలు 

తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసి అవకాశం ఉంది.

భారీ వర్షాలు

 ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.