చదువుకు డబ్బుల్లేక యువతి సూసైడ్

చదువుకు డబ్బుల్లేక యువతి సూసైడ్

చదువుకు డబ్బులు లేక  తెలంగాణ విద్యార్థిని తనువు చాలించింది. చదువు వల్ల తల్లిదండ్రులుకు భారంగా మారానని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఐశ్వర్య ఢిల్లీలో  ఎల్ఎస్ఆర్ యూనివర్సిటీలో డిగ్రీ  సెకండ్ ఇయర్ చదువుతుంది. గత సంవత్సరం స్కాలర్షిప్ రాకపోవడంతో హాస్టల్ డబ్బులు చెల్లించకపోవడంతో యూనివర్సిటీ నిర్వహకలు ఖాళీ చేయించారు. దీంతో మనస్థాపం చెందిన ఐశ్వర్య ఇటీవల సొంతింటికి వచ్చి ఈ నెల 3 న ఆత్మహత్య చేసుకుంది. తండ్రి శ్రీనివాస్ రెడ్డి మెకానిక్ గా పని చేస్తున్నాడు.

‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు..నా కుటుంబానికి  నేను భారం అవుతున్నా..నేను చదువుకోలేక బతకలేను. చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా నాకు చావే కరెక్ట్ అనిపించింది. అందరూ నన్ను క్షమించాలి ‘అని లేటర్ రాసింది యువతి.

ఐశ్వర్య… ఇంటర్ లో స్టేట్ టాపర్. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరాం ఉమెన్స్ కాలేజీలో చదువుతోంది. ఐశ్వర్యకు కేంద్ర  సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ స్కాలర్ షిప్ అందిస్తోంది. అయితే మార్చి నుంచి ఈ స్కాలర్ షిప్ అందడం లేదు. ఈ విషయాన్ని ఐశ్వర్య ఎల్ఎస్ఆర్ విద్యార్థుల కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. ఇంటర్ నెట్ కనెక్షన్ లేదని, తన చదువు కుటంబానికి భారంగా మారిందని తెలిపింది. లాప్ టాప్, మెటీరియల్  లేకపోవడంతో చదవలేకపోతున్నాని చెప్పింది. మరోవైపు డబ్బులు కట్టకపోవవడంతో హాస్టల్ ఖాళీ చేయించింది ఎల్ఎస్ఆర్ మేనేజ్ మెంట్. దీంతో మనస్తాపానికి గురైన ఐశ్వర్య ఈ నెల 3న రంగారెడ్డి జిల్లాలోని సొంత ఊరిలో   ఆత్మహత్య చేసుకుంది.

ఐశ్వర్య ను ఆదుకోవాలని ఎల్ఎస్ఆర్ నిర్వాహకులకు పలుమార్లు మెయిల్స్ పంపినా లాభం లేదన్నారు విద్యార్థి సంఘాల నేతలు. కేవలం కొత్త విద్యార్థులకు మాత్రమే వసతి కల్పిస్తామని చెప్పడం, కేంద్రం కూడా స్కాలర్ షిప్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై ఐశ్వర్యపై ప్రభావం చూపిందన్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, విద్యార్థుల ఫెలోషిప్‌లను విడుదల చేయాలని ప్రభుత్వానికి పదేపదే పిటిషన్ వేశామని ఎస్ఎఫ్ఐ తెలిపింది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్  చేసింది  పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ మొత్తాన్ని ఆమె కుటుంబానికి ఒకేసారి పంపిణీ చేయాలని.. ప్రభుత్వం నుండి  అదనపు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.