
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఐటీడీఏలో ట్రైబల్ మ్యూజియాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించినందుకు 2025 సంవత్సరానికి టూరిజం ఎక్స్ లెన్స్ అవార్డును సీఎం రేవంత్రెడ్డి శనివారం ఐటీడీఏ పీవో బి.రాహుల్కు అందజేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, క్రీడాశాఖ మంత్రి వాకాటి శ్రీహరి కూడా పాల్గొని పీవో రాహుల్ కృషిని అభినందించారు.