
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ టూరిజం డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదికిగాను టూరిజం ఎక్సలెన్స్ అవార్డులను శనివారం ప్రకటించింది. బెస్ట్ హరిత హోటల్స్ కేటగిరీలో హైదరాబాద్ తారామతి బరాదరి కల్చరల్ కాంప్లెక్స్, హరిత హోటల్ రామప్ప, అలీసాగర్ హరిత లేక్‌వ్యూ రిసార్ట్‌కు అవార్డులు దక్కాయి. ఫైవ్ స్టార్ కేటగిరీలో ది వెస్టిన్, పార్క్ హయత్, గోల్కొండ రిసార్ట్స్, ఫోర్ స్టార్ కేటగిరీలో దస్పల్లా, మృగవాని రిసార్ట్ అండ్ స్పా, త్రీస్టార్ కేటగిరీలో వెస్ట్ వెస్టర్న్ అశోక్ ఉన్నాయి. బెస్ట్ థీమ్ బేస్డ్ అవార్డును పామ్ ఎక్సోటికా రిసార్ట్ అండ్ వైల్డ్ వాటర్స్‌కు దక్కింది. హైదరాబాద్ పరిధిలో బెస్ట్ రెస్టారెంట్‌గా ఓహ్రీ సాహిబ్ బార్బిక్యూ, హైదరాబాద్ వెలుపల బెస్ట్ రెస్టారెంట్స్‌గా కరీంనగర్‌లోని తారక, మహబూబ్‌నగర్‌లోని ప్రశాంత్ హోటల్‌కు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్టాండ్‌లోన్ కన్వెన్షన్ సెంటర్‌గా నోవాటెల్ అండ్ హెచ్‌ఐసీసీ నిలిచింది. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణకు చెందిన రంగారావు రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌కు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది.