
తెలంగాణలో ఎన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. యువత, పాఠశాల విద్యార్థుల్లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్ షిప్ నైపుణ్యాలను పెంపొందించేందు.. త్వరలో హైదరాబాద్ లో ప్రత్యేకమైన వై హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, యూనిసెఫ్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని యువత.. సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్ షిప్‌పై దృష్టి పెట్టేలా వై-హబ్ ప్రోత్సహించనుంది.
యువ ఆవిష్కర్తలకు అవకాశాలు, మెంటార్ షిప్, నైపుణ్య కార్యక్రమాలు, వర్క్ షాప్‌లు, క్యాంపులు, కోక్రియేటింగ్ స్పేస్‌లు, ఆర్థిక వనరులను వైహబ్ అందించనుంది. వివిధ సంస్థల భాగస్వామ్యంతో యువత విద్య పైనే కాకుండా.. కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహించే ప్రయత్నాలు చేయనుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్ షిప్ ప్రోత్సహించేందుకు.. యూనిసెఫ్‌తో కలిసి వైహబ్ పనిచేయనుంది. యువ ఆవిష్కర్తలను ఎకోసిస్టం, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలతో అనుసంధానించి వైహబ్ అవకాశాలు కల్పించనుంది.