తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ఫైళ్లు మాయం .. పోలీసులకు ఓఎస్ డీ ఫిర్యాదు

తెలంగాణ  వక్ఫ్ బోర్డ్ ఫైళ్లు మాయం .. పోలీసులకు ఓఎస్ డీ ఫిర్యాదు

బషీర్​బాగ్​,వెలుగు: తెలంగాణ వక్ఫ్ బోర్డ్ కు సంబంధించి కొన్ని ఫైళ్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఈ నెల 24న బోర్డు ఓఎస్డీ మహ్మద్ అసిఫ్ ఖాన్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబిడ్స్ ఇన్​స్పెక్టర్ ఇమాన్యుల్ తెలిపిన ప్రకారం.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న వక్ఫ్ బోర్డు ఆఫీసులో చైర్మన్​ చాంబర్ లోని ఓ ఫైల్ మాయం కావడంతో పాటు ఆన్​లైన్ లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఇటీవల డిలీట్ అయినట్లు ఓఎస్డీ మహ్మద్ అసిఫ్ ఖాన్ గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్ తెలిపారు.