తెలంగాణకు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

తెలంగాణకు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌

డెహ్రడూన్‌‌‌‌‌‌‌‌: నేషనల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు మూడో పతకం లభించింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 3X3 బాస్కెట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. మంగళవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 21–11తో కేరళపై నెగ్గింది. 2023 నేషనల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లోనూ తెలంగాణ టీమ్‌‌‌‌‌‌‌‌ స్వర్ణం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ 18–11తో తమిళనాడుపై నెగ్గి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మెన్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ 22–20తో కేరళను ఓడించి స్వర్ణాన్ని సాధించింది. అయితే బ్రాంజ్ మెడల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ 16–21తో తమిళనాడు చేతిలో ఓడి పతకానికి దూరమైంది.