నాట్ టెస్టుల్లో తెలంగాణకు నేషనల్ అవార్డు

నాట్ టెస్టుల్లో తెలంగాణకు నేషనల్ అవార్డు

హైదరాబాద్, వెలుగు: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నాట్ (ఎన్ఏఏటీ~న్యూక్లియక్‌ యాసిడ్‌ ఆంప్లికేషన్‌ టెస్ట్‌) పరీక్షల్లో రాష్ట్రానికి ఓవరాల్ బెస్ట్ నేషనల్ అవార్డు లభించింది. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 2025 ప్రపంచ టీబీ దినోత్సవ వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ అవార్డును రాష్ట్ర ఫ్యామిలీ వేల్ఫేర్ కమిషనర్, ఎన్ హెచ్ఎం ఎండీ ఆర్.వీ కర్ణణ్, టీబీ జేడీ డాక్టర్ ఏ రాజేశంలకు అందజేశారు.

టీబీ నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. 2025 పూర్తయ్యే నాటికి టీబీ రహిత దేశంగా మార్చేందుకు ఈ అవార్డు బూస్టును ఇచ్చిందని మంత్రి అభిప్రాయపడ్డారు.