
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 31న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం ఇన్ చార్జ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ సోమవారం రిలీవ్ కాను న్నారు. ఆయనను మహారాష్ట్ర గవర్నర్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. రాధాకృష్ణన్ సహా మొత్తం 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సోమవారం రాజ్ భవన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వెళ్లి రాధాకృష్ణన్ కు వీడ్కోలు పలకనున్నారు. కాగా.. బోనాల సందర్భంగా ప్రజలకు రాధాకృష్ణన్ శుభా కాంక్షలు తెలిపారు. మహాంకాళి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాల ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.