
-
ప్లాన్లు సిద్ధం చేసి రిపోర్ట్ ఇవ్వండి
-
హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ సిటీ, వెలుగు : ప్రభుత్వ వైద్యానికి సర్కారు ప్రాధాన్యత ఇస్తోందని.. గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్లాన్లు సిద్ధం చేసి రిపోర్ట్ఇవ్వాలని కలెక్టర్ హరిచందన వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం (జులై 07) కలెక్టరేట్ మెడికల్ కాలేజీల మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆమె ఉస్మానియా, గాంధీ దవాఖానల వైద్యాధికారులతో అక్కడ కల్పిస్తున్న వసతులు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీ, ఉస్మానియాలో కావాల్సిన ఎక్విప్మెంట్, మౌలిక వసతులు కల్పన గురించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సమస్యలు, వైద్య సిబ్బంది కొరత వంటి అంశాలపై చర్చించారు. డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధన, బోధనేతర సిబ్బంది, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బంది నియమాకంపై చర్చించారు. మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్కోరారు.
గాంధీలో నీటి సమస్య ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి డాక్టర్లు తీసుకురాగా, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కాలేజీలో టీచింగ్ సిబ్బంది కొరత ఉన్నందున భర్తీ ప్రక్రియపై చర్చించారు. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదిక టీచింగ్ స్టాఫ్భర్తీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నాన్ టీచింగ్, శానిటేషన్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంపికకు ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. అడిషనల్కలెక్టర్ ముకుంద రెడ్డి, ఇన్చార్జి డీఆర్ఓ డి శ్రీధర్, ఆర్డీవోలు రామకృష్ట, సాయిరామ్, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.