నటుడు అడవిశేష్ కు డెంగీ.. ఆస్పత్రిలో చేరిక

V6 Velugu Posted on Sep 20, 2021

  • రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో ఈనెల 18న ఆస్పత్రిలో చేరిన అడవి శేష్

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర నటుడు, వర్ధమాన హీరో అడవి శేష్ డెంగీ బారినపడ్డారు. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షిస్తున్నారని ఆయన టీమ్ ప్రకటించింది. ఈనెల 18వ తేదీన ఆస్పత్రిలో చేరారని.. కోలుకుంటున్నారని సమాచారం. 
వర్దమాన హీరో అడవి శేష్ ‘గూఢచారి.. ఎవరు’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలతో ఆయన తక్కువ సినిమాలతోనే ప్రత్యేకత నిరూపించుకున్న అడవి శేష్ ఆస్పత్రి పాలైన విషయం తెలియడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. 
అడవి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ సినిమా చిత్రం షూటింగులో ఉన్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాను ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తున్నారు. గూఢచారి సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా గూఢచారి-2 చేస్తానని ప్రకటించారు. అలాగే హిట్-2 సినిమా కోసం కథను రెడీ చేసుకుని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

 

Tagged tollywood, Telugu film industry, , Telugu movies updates, actor Adavi Sesh, adavi sesh, hero adavi sesh, telugu upcoming hero

Latest Videos

Subscribe Now

More News