Naresh : ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. '90ల్లోనే ప్రయాణం సేఫ్ గా ఉండేదంటూ ఫోస్ట్!

Naresh : ఎయిర్‌పోర్ట్‌లో నరేశ్‌కు చేదు అనుభవం.. '90ల్లోనే ప్రయాణం సేఫ్ గా ఉండేదంటూ ఫోస్ట్!

టాలీవుడ్ నటుడు నరేశ్ కు  హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానాలు రద్దు కావడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో  ఎయిర్ పోర్టులో తాను పడిన ఇబ్బందులపై అసహనం వ్యక్తం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుత విమాన ప్రయాణాలతో పోలిస్తే 1990ల నాటి ప్రయాణాలు సురక్షితంగా ఉండేవని పోస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే?

నటుడు నరేశ్ బుధవారం ఉదయం 8:15 గంటలకు  సమయానికి హైదరాబాద్ ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నారు. కానీ సాంకేతిక లోపంతో అన్ని ఇండిగో విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్ని రద్దయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా వివరిస్తూ పోస్ట్ చేశారు. విమానంలో తినడానికి ప్యాక్ చేసిన ఆహారం తీసుకున్నాను..  కానీ షాపింగ్ చేసి తిరిగి వచ్చేసరికి, గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధం జరిగిందని చెప్పుకొచ్చారు. 

నాకు టైమ్ మెషిన్ ఉంటే..

అయితే ఇదే సమయంలో కొందరు అభిమానులు సెల్ఫీ కోసం నరేశ్‌ను సంప్రదించడంపైనా ఆయన స్పందించారు. ఈ సమయంలో ఈ గందరగోళంలోనూ కొందరు అభిమానులు సెల్ఫీ కోసం నరేశ్‌ను సంప్రదించారు. దీనిపై స్పందించిన నరేశ్‌, తమ వ్యక్తిగత గోప్యత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. "సన్ గ్లాసెస్ , మాస్క్‌లు ధరించినా కూడా నటులను సులభంగా గుర్తించగలిగే 'స్కానర్‌లు' మనుషుల్లో అభివృద్ధి అయ్యాయని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నాకు టైమ్ మెషిన్ ఉంటే, 90వ దశకంలోకి తిరిగి వెళ్లాలని కోరుకుంటాను. అప్పటి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాలు సురక్షితంగా, బాగుండేవి. ఇప్పుడు విమానాలు బాక్టీరియాకు నిలయాలుగా మారాయి, అందుకే మాస్క్‌లు తప్పనిసరి అని పోస్ట్ చేశారు నరేశ్.. 

ALSO READ : 'అఖండ 2'లో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు..

ఇండిగో విమానాల రద్దుతో గందరగోళం

బుధవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. హైదరాబాద్ నుంచి 19 విమానాలు రద్దయ్యాయి. గురువారం కూడా సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ నుంచి బయలుదేరే 33 విమానాలు, అలాగే వచ్చే 35 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది, దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది.