Balakrishna: 'అఖండ 2'లో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు.. జనసేనాని పవన్ కళ్యాణ్ బాటలో బాలకృష్ణ..!

Balakrishna: 'అఖండ 2'లో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు.. జనసేనాని పవన్ కళ్యాణ్ బాటలో బాలకృష్ణ..!

డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు, నటుడు పవన్ కల్యాణ్‌.. ‘సనాతన ధర్మాన్ని’ బహిరంగంగా సమర్థించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తనను తాను 'క్షమాపణ చెప్పని సనాతనీ హిందూ' అని కూడా పవన్ చెప్పుకున్నారు. ఇలా హిందూ ధర్మ రక్షణపై తనదైన శైలిలో ఎప్పటికప్పుడు వాయిస్ రేజ్ చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఎన్నో స్టేజీలపైనా సనాతన భావాలు, ఆచారాల గురించి మాట్లాడుతూ పవన్ తన గొంతు వినిపిస్తున్నారు. కోట్లాది మంది హిందువులను ఏకం చేయటానికి సనాతన ధర్మం ఒక్కటే సరైన మార్గం అంటూ.. తెలుగు ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ తర్వాత.. నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తుండటం విశేషం. ఇది ఇప్పుడు అఖండ 2 మూవీ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ విషయాల్లోకి వెళితే.. 

బాలకృష్ణ నటించిన ‘అఖండ2’ మూవీ సనాతన ధర్మం కాన్సెప్ట్పై తెరకెక్కింది. సమాజంలో అధర్మం, అకృత్యాలు మితిమీరితే మనిషే ఆ దేవుడిని ఆవహించుకుని దుష్టశిక్షణ చేస్తాడనేది అఖండ 2 ద్వారా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా బాలకృష్ణ సనాతన ధర్మ విశేషాలను పంచుకున్నారు.

అఖండ 2 లోని ఇతివృత్తం గురించి బాలయ్య ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సనాతన ధర్మ భావనను బలంగా సమర్థించారు. ఈ చిత్రం భవిష్యత్ తరాలకు సనాతన ధర్మం గురించి తెలియజేస్తుందని అన్నారు. ‘‘సనాతన ధర్మం అంటే సత్యం కోసం పోరాడటం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం. "అఖండ 2" చిత్రం ద్వారా సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాలయ్య చెప్పారు. 

►ALSO READ | Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. సానుభూతి వద్దు.. రాజ్ -సమంత పెళ్లిపై శ్యామాలి దే ఎమోషనల్ పోస్ట్!

‘‘సనాతన ధర్మం గురించి అందరికీ తెలుసు, కానీ భవిష్యత్ తరాలు అఖండ 2 ద్వారా సనాతన ధర్మం గురించి మరింత నేర్చుకుంటారు. ఎందుకంటే.. సినిమా ఒక శక్తివంతమైన మీడియా. ఇది ప్రజలతో నేరుగా సంభాషించడానికి సరైన వేదిక. అలా అఖండ 2 ద్వారా సనాతన ధర్మ విషయాలు మరింత లోతుగా అర్ధం అవుతాయి. ప్రజలు ప్రతిరోజూ తమ దినచర్యలో గడుపుతున్నారు. అలాంటి వారు ఇలాంటి సినిమా చూస్తే ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది. భవిష్యత్ తరాలకు కూడా సనాతన ధర్మం గురించి నేర్పుతుందని భావిస్తున్నట్లు’’బాలయ్య తెలిపారు. 

అలాగే, అఖండ 2 మూవీ సనాతన ధర్మం యొక్క శక్తిని వివరించే ఓ మార్గదర్శి అని అన్నారు బాలకృష్ణ. ‘సనాతన ధర్మం అంటే ఏమిటి? అంటే మీరు సత్యం కోసం, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడండి మరియు ధర్మాన్ని అనుసరించండి అని చెబుతుంది. ఇందులో నా పాత్ర సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మూవీ సనాతన ధర్మం గురించి చెప్పే ఒక ఎన్సైక్లోపీడియా. ప్రతి ఒక్కరూ దీనిని చూడాలి’
అని బాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

ప్రీమియర్‌ టికెట్ల హంగామా!

'అఖండ 2' శుక్రవారం (డిసెంబర్ 5న) అఖండ 2తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. ప్రీమియర్ షోల కోసం టికెట్లు క్షణాల్లో అమ్ముడవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీమియర్ టికెట్ల ధరను రూ.600 వరకు పెంచేందుకు అనుమతి ఇవ్వడంతో, ఆంధ్రా ప్రాంతంలో 'అఖండ 2' ప్రదర్శనలకు అఖండమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేవలం 222 షోల ద్వారా 32,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 120 షోలు 'ఫుల్' అయ్యాయి. ఒక్క అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా రూ1.87 కోట్ల వసూళ్లు సాధించింది. దీనిని బట్టే సినిమాపై ప్రేక్షకులకు ఎంతటి నమ్మకం ఉందో అర్థమవుతోంది. విదేశాల్లో కూడా బుకింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయి.