నటి సమంత , దర్శకుడు రాజ్ నిడిమోరు వివావాం ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లోని లింగభైరవి ఆలయంలో ప్రత్యేక సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి దే గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. లేటెస్ట్ ఆమె సోషల్ మీడియలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
నిద్రలేని రాత్రులు గడుపుతున్నా..
సమంత-రాజ్ వివాహం జరిగిన నాలుగు రోజుల తర్వాత.. తనకు లభిస్తున్న మద్దతుపై శ్యామాలి తొలిసారిగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందించారు. నెటిజన్లు, మీడియా నుంచి తనకు వస్తున్న సానుభూతి, ఇంటర్వ్యూల అభ్యర్థనలను ఉద్దేశించి ఆమె సుదీర్ఘమైన నోట్‌ను పంచుకున్నారు. 'నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను' అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు శ్యామాలి. తాను ప్రస్తుతం వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించే పరిస్థితుల్లో లేనని, ఎందుకంటే తన గురువుగారికి నవంబర్ 4న స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. తాను ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోసమే ప్రార్థిస్తూ, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తెలిపారు. నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. నా సోషల్ మీడియా ఖాతాలను నేనే మెయిన్‌టెన్ చేస్తాను అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు ఆశించవద్దు. మీడియా వారు నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. నా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని కోరారు శ్యామాలి . తాను ధ్యానం చేస్తున్నానని, శాంతి, ప్రేమ, క్షమ, దయ వంటి మంచి శక్తిని అందరికీ పంపడం ఇందులో భాగమని ఆమె తెలిపారు. ఇప్పుడు తనకు లభిస్తున్న మద్దతు ఆ శుద్ధమైన శక్తి తిరిగి తనకే లభిస్తున్న ఫలితం అని ఆమె ఒక స్నేహితుడి మాటలను ఉటంకించారు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆమె తన సందేశాన్ని ముగించారు.
రాజ్ - శ్యామాలి బంధం
దర్శకుడు రాజ్ నిడిమోరు, రచయిత్రి శ్యామాలి దే 2015లో వివాహం చేసుకున్నారు. శ్యామాలి 'ఓంకార', 'రంగ్ దే బసంతి' వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. రాజ్, శ్యామాలికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. 2022లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. విడాకులకు ముందు కూడా శ్యామాలి 'ఋణానుబంధం' గురించి పోస్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
సమంత, రాజ్ ప్రేమాయణం
సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ సెట్స్‌లో జరిగింది. అప్పటి నుంచి వీరి స్నేహం బలపడి క్రమంగా ప్రేమగా మారింది. వీరు కలిసి 'సిటడెల్: హనీ బన్నీ' సిరీస్‌లోనూ పనిచేశారు. అలాగే, సమంత నిర్మాణంలో వచ్చిన 'శుభం' చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలను ఖండించకపోవడంతోనే వారి వివాహంపై ఊహాగానాలకు తెరపడింది. అయితే శ్యామాలి దే ప్రస్తుతం తన వ్యక్తిగత ఆవేదనను పంచుకోవడం ద్వారా, రాజ్-సమంత పెళ్లిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని, తన గురువు ఆరోగ్యంపైనే తన దృష్టి ఉందని స్పష్టం చేశారు..
