లై (Lie) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మేఘా ఆకాష్(Megha Akash) పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు సాయి విష్ణు(Saai Vishnu)తో గురువారం ఆగస్ట్ 22న మేఘా ఆకాష్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మేఘా ఆకాష్ కూడా గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన రావణాసుర(Ravanasura) సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం మేఘా..తమిళ్ లో ఒకటి, తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పింది.
మేఘా ఆకాష్ తెలుగు సినిమాలు చూసుకుంటే లై, చల్ మోహన్ రంగా, రావణాసుర,డియర్ మేఘ, మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించింది.