ఇదేందయ్యా ఇది.. SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో ప్లే అవుతున్న పైరసీ సినిమాలు !

ఇదేందయ్యా ఇది.. SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో ప్లే అవుతున్న పైరసీ సినిమాలు !

హైదరాబాద్: SBI ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు కనిపించడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల్లో పైరసీ కలకలం రేపింది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే sbiterminsurance.com పేరుతో పైరసీ వెబ్ సైట్ అందుబాటులోకి రావడం గమనార్హం. Term insurance laps and revival guide పేజీకి రీ డైరెక్ట్ అయి ఈ పేజీలో పైరసీ సినిమాలు ఓపెన్ అయి ప్లే అవుతున్నాయి. దీంతో.. సైబర్ క్రైమ్ స్టేషన్లో ఈ విషయమై SBI సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఇమ్మడి రవి ఐబొమ్మ, బప్పం, ఐరాధా అనే మూడు వెబ్ సైట్లను నిర్విహించాడు. ఇందులో ఐబొమ్మ పాపులర్ డొమైన్ కాగా, రవి అరెస్ట్ తర్వాత మరింత ట్రెండింగ్లోకి వెళ్లింది. ఈ క్రమంలో.. దీన్ని చాలా మంది పైరసీదారులు ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే ఐబొమ్మ క్లోజ్ కావడంతో.. ఆ వెబ్ సైట్ ను పోలిన కొత్త వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఐబొమ్మ వన్ కూడా అలాంటిదే. ఈ సైట్​లో సినిమా సినిమాలు లేకపోయినప్పటికీ.. థంబ్ నెయిల్పై క్లిక్ చేస్తే అవి మూవీ రూల్జ్​అనే పైరసీ వెబ్ సైట్ కు రీడైరెక్ట్​అవుతున్నాయి.

ఈ విషయం విపరీతంగా ప్రచారమవడంతో సిటీ సైబర్​క్రైమ్​పోలీసులు స్పందించారు. ఐబొమ్మ వన్ వెబ్​సైట్​లో సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే వస్తున్నాయని, ఎక్కడికీ రీడైరెక్ట్ కావడం లేదని, సినిమాలు ఓపెన్ కావడం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే, పొద్దంతా మూవీ రూల్జ్కు రీ డైరెక్ట్​అయినా పోలీసులు ప్రకటన చేసిన తర్వాత ఓపెన్ చేస్తే వివిధ సినిమాల ట్రైలర్స్, రివ్యూస్ మాత్రమే వచ్చాయి.