నవ్వించే క్యారెక్టర్లు చతుర్ వితుర్

నవ్వించే క్యారెక్టర్లు చతుర్ వితుర్

‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరి’.  అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల,  శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.   శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవ్వించే పండితులు ‘చతుర్’గా శ్రీనివాస రెడ్డి, ‘వితుర్’గా చమ్మక్ చంద్రగా కనిపించనున్నట్టు సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వీరిద్దరూ  పండితుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ స్టేజ్‌‌‌‌‌‌లో ఉందన్నారు మేకర్స్. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేస్తామన్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.