పద్మారావునగర్, వెలుగు: కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడిన హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు అక్కడ గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు గురువారం సమీపంలోని సముద్రంలోకి పడవపై వెళ్లి నిమజ్జనం చేశారు.
మోంబాసా తెలుగు అసోసియేషన్(ఎంవోఎంటీఏ) ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపినట్లు చైర్మన్ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఫస్ట్ టైం సెలబ్రేషన్స్ నిర్వహించామని, ఇక నుంచి ప్రతీ ఏటా కంటిన్యూ చేస్తామని చెప్పారు.
