
బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ నిరాశ పరుస్తోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడి హ్యాట్రిక్ పరాజయం మూటగట్టు కుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 33-48తో యూపీ యోధాస్ జట్టు చేతిలో చిత్తయింది.
యోధా టీమ్‌లో సురేందర్ గిల్ 14, కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 8 పాయింట్లతో చెలరేగారు. టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ (11) మరోసారి సూపర్ టెన్ సాధించినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 38-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.