తెలుగు సీరియల్ నటికి వేధింపులు.. అంత మంచి జాబ్ చేస్తూ ఇతనికి ఇదేం పాడు బుద్ధి..!

తెలుగు సీరియల్ నటికి వేధింపులు.. అంత మంచి జాబ్ చేస్తూ ఇతనికి ఇదేం పాడు బుద్ధి..!

బెంగళూరు: కన్నడ, తెలుగు సీరియల్స్లో నటిస్తున్న 41 ఏళ్ల టీవీ నటికి చేదు అనుభవం ఎదురైంది. తనను ఒక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేస్ బుక్లో Naveenz అనే పేరుతో ఒక వ్యక్తి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడని, యాక్సెప్ట్ చేయకపోవడంతో అప్పటి నుంచి టార్చర్ చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మెసెంజర్లో రోజూ అసభ్యకర మెసేజ్లు, ఫొటోలు పంపిస్తూ తనను వేధిస్తున్నాడని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిని బ్లాక్ చేసినా కొత్త కొత్త యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని తనను లైంగికంగా వేధిస్తున్నాడని.. అతని ప్రైవేట్ పార్టులను ఫొటోలు తీసి తనకు పంపుతూ నీచంగా ప్రవర్తిస్తున్నాడని.. నరకం చూపిస్తున్నాడని ఆమె వాపోయింది.

నవంబర్ 1న కూడా తనకు అతను మళ్లీ మెసేజ్ చేశాడని.. అతనికి బుద్ధి చెప్పేందుకు నేరుగా కలిసి మాట్లాడదామని తాను అడిగినా అతను నిరాకరించాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. ఇక అతని వేధింపులు తట్టుకోలేక నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు టీవీ నటి తెలిపింది. పోలీసులు ఆమె ఫిర్యాదుతో నిందితుడిపై లైంగిక వేధింపుల కేసుతో పాటు, ఆన్ లైన్లో వేధింపుల కేసు కూడా నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. నిందితుడిని Naveen K Mon అని పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 

నవీన్ అనే ఈ నిందితుడు బెంగళూరులోనే ఒక గ్లోబల్ టెక్నాలజీ రిక్రూట్మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. లండన్, ప్యారిస్, ఆమ్ స్టర్ డ్యామ్, బెర్లిన్, జ్యూరిచ్, న్యూయార్క్లో నిందితుడు పనిచేస్తున్న కంపెనీకి ఆఫీసులు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తూ ఇలా ఒక మహిళను వేధించాడని తెలిసి అతని సహోద్యోగులే విస్తుపోయారు. నవీన్ చేసిన పనికి అతనిని అసహ్యించుకున్నారు. కంపెనీ అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఒక టీవీ నటిపై మితిమీరిన వ్యామోహంతో ఆమెను వేధించి బంగారం లాంటి జీవితాన్ని నవీన్ నాశనం చేసుకున్నాడు.