మంచి నటి  అనిపించుకుంటే చాలు

మంచి నటి  అనిపించుకుంటే చాలు

రోల్ ఏదైనా దానికి న్యాయం చేయడం ఇంపార్టెంట్. దానికోసం ఎంతైనా కష్టపడతా. నచ్చితే ఏ రోల్ అయినా చేస్తా. స్టార్​డమ్ నాకొద్దు. కానీ, మంచి నటి అనిపించుకుంటే చాలు.” అంటోంది సంయుక్త మెనన్. కోలీవుడ్, మాలీవుడ్​లలో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి ఇప్పుడు టాలీవుడ్​లో కూడా అడుగుపెట్టింది. పవన్​ కళ్యాణ్, రానా నటిస్తున్న మలయాళ రీమేక్​​ సినిమా ‘భీమ్లా నాయక్’​లో రానాకి భార్యగా నటిస్తోంది. ఆమె గురించిన   విశేషాలు ఇవి..

సంయుక్త ముద్దు పేరు నీతు. కేరళలోని పాలక్కడ్​లో పుట్టింది. అక్కడే చిన్మయ విద్యాలయలో చదువుకుంది. ఎప్పుడూ యాక్టింగ్ వైపు రావాలనుకోలేదట. ఇంజినీరింగ్ –మెడికల్ ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫేస్ బుక్​లో పెట్టిన ఫొటోలను ఒక ఫొటోగ్రాఫర్​ చూసి, మ్యాగజైన్ కవర్​ మోడల్​గా చేస్తారా?, అని అడిగాడట. అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చింది సంయుక్త. డాక్టర్ అవ్వాలనుకుని రాసిన ఎంట్రన్స్​ ఎగ్జామ్​లో సీటు రాలేదు. మళ్లీ రాయాలని కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఖాళీ టైంలో సరదాగా ఫొటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. అలా అప్​లోడ్ చేసిన ఫొటోలు చూసి వనిత మ్యాగజైన్​ కవర్​ ఫొటో కోసం మోడల్​గా అడిగారు. అది చేశాక సినిమా ఆఫర్​ వచ్చింది. అయితే అదే టైంలో ఎంబీబీఎస్​లో అడ్మిషన్​ కూడా వచ్చింది. రెండూ ఒకేసారి రావడంతో ఆలోచనలో పడింది. రొటీన్ లైఫ్​ తన వల్ల కాదని ఇంట్లో వాళ్లకి చెప్పేసింది. సినిమాల్లో అడుగుపెట్టి బిజీ అయిపోయింది.

సినిమా కెరీర్ 

పాప్ కార్న్అనే మలయాళం మూవీతో 2016లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత తమిళంలో కూడా ఆఫర్లు వచ్చాయి. దాంతో కోలీవుడ్​లో రెండు సినిమాలు చేసింది. కానీ, అవి సక్సెస్​ కాకపోవడంతో తిరిగి మాలీవుడ్​కి వెళ్లింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్తకు తెలుగులో కూడా ఛాన్స్ రావడంతో వెంటనే ఒప్పుకుంది.  తెలుగులో ‘భీమ్లా నాయక్​’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో పవన్​ కళ్యాణ్​కి నిత్యామెనన్, రానాకి.. సంయుక్త మెనన్​లు జోడిగా చేస్తున్నారు. 

చెంప పగలకొట్టింది

తీవండీ సినిమాలో హీరో చైన్​ స్మోకర్. స్మోకింగ్ చేయడం మానుకోమని హీరోయిన్​ చెప్తుంది. తను ఎంత చెప్పినా మాట వినకపోవడంతో హీరో చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ హీరోయిన్ పాత్ర చేసింది​ సంయుక్త. ఆ సినిమాలో లాగే రియల్ లైఫ్​లో స్మోకింగ్ చేసేవాళ్లని ఎవరినైనా కొట్టారా? అని అడిగితే... ‘‘కొట్టాను. ఒకసారి నేను, అమ్మ కలిసి బయటకు వెళ్లాం. అప్పుడు ఒక చోట నిల్చొని ఉంటే ఒకతను స్మోక్​ చేసి, మా వైపు పొగ వదులుతున్నాడు. పక్కకు జరుగుదామంటే ప్లేస్​ లేదు. ఆ పొగకి మా అమ్మ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడింది. అది గమనించి ‘స్మోక్ చేయకండి, ఇబ్బందిగా ఉంద’ని చాలాసార్లు చెప్పా. అతను పొగరుగా సమాధానమిచ్చాడు. దాంతో కోపమొచ్చి, చెంప చెళ్లుమనిపించా. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాం. మా అమ్మ భయపడిపోయింది. ‘అతన్ని కొట్టడం అవసరమా?’ అని అరిచింది. అంతే ఆ తర్వాత  ఎవరినీ కొట్టలేదు. ఈ సినిమాలో కథ ప్రకారం హీరోయిన్​, హీరోని కొడుతుంది. అది ఓన్లీ యాక్టింగ్.

 ట్రావెలింగ్ ఇష్టమే. కానీ...

నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. స్టార్టింగ్​లో ఫిజికల్ ఫిట్​నెస్​కోసం సెలవు తీసుకుని మరీ గ్రౌండ్​లో రౌండ్లు కొట్టేదాన్ని. ఢిల్లీ నుంచి కేరళకు ట్రైన్​లో జర్నీ చేసేదాన్ని. లడాఖ్​​లో షూటింగ్ చేసేటప్పుడు ఆక్సిజన్​ లెవల్స్​ తగ్గిపోయేవి. చాలా ఇబ్బంది పడ్డాను. సింధు నదిలో బోట్​లో షూటింగ్​​ చేశారు. అంత చలికి, ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైంది. ఆక్సిజన్​ మాస్క్, ఆక్సిజన్​ సిలిండర్స్​ వెంట తీసుకెళ్లేవాళ్లం. ఎలా ఉన్నా కూడా ఎక్స్​ప్రెషన్​ సరిగా రావాలి. చాలా కష్టపడి ఆ షూటింగ్​ కంప్లీట్ చేశాం. వెకేషన్​కి వెళ్లినట్టు ఉండేది. కానీ, షూటింగ్​ చేసేటప్పుడు చలి తట్టుకోలేకపోయా. ఆక్సిజన్​ లేకపోతే ఎవరూ బతకలేరు కదా. అలాంటిది పరిస్థితుల్లో పనిచేయాలంటే కష్టం అనిపించింది. అప్పటి నుంచి అక్కడుండే వాళ్ల మీద రెస్పెక్ట్ పెరిగింది. 

నా ఇంట్రెస్ట్​లు ఒకటి కాదు

బుక్స్​ చదువుతాను. స్కూబా డైవింగ్ ఎంజాయ్ చేస్తా. పాటలు వింటూ, పాడుకుంటా. నిజానికి మ్యూజిక్​ కంటే పాట లిరిక్స్​ ఎక్కువ నచ్చుతాయి. పొయెట్రీ బాగా ఇష్టం. ఏ.ఆర్​ రెహమాన్ పాటలు ఎన్నిసార్లైనా వినాలనిపిస్తాయి. ‘జీన్స్’​ సినిమాలో ‘‘పువ్వుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం.. పాట చాలా ఇష్టం. కవిత్వం ఉండే పాటలు నాకు బాగా నచ్చుతాయి. వాటి గురించి మాట్లాడడం కూడా చాలా ఇష్టం. ఆర్ట్ అంటే కూడా ఇష్టమే. నేను ఆర్టిస్ట్​ని​ కూడా. 2020లో వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఉమెన్స్ హెల్త్​కేర్ కాంప్రెహెన్సివ్ సెంటర్​లో స్పీచ్​ ఇవ్వడానికి నన్ను పిలిచారు. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నలుగుర్ని ఇన్​ఫ్లుయెన్స్​ చేసేలా మాట్లాడటాన్ని ఇష్టపడతా. 

నెగెటివ్​ కామెంట్స్​ యాక్సెప్ట్ చేస్తా

సినిమాలో నా యాక్టింగ్, రోల్ నచ్చకపోతే కొంతమంది క్రిటిసైజ్ చేస్తుంటారు. అందుకు బాధ పడను. ఎందుకంటే  డైరెక్టర్​, కథలను నమ్మి సినిమా చేస్తాను. అవి ఆడియెన్స్​ అందరికీ నచ్చాలని లేదు. కాబట్టి నచ్చని వాళ్లు పెట్టే నెగెటివ్ కామెంట్స్​ని తీసుకుంటా. ఆ కామెంట్స్​ని బట్టి ​కథల సెలక్షన్​ లేదా నా యాక్టింగ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడతా. ప్రతి సినిమాకి నా యాక్టింగ్​ బెటర్​ అవ్వాలి. అనుకుంటా!

 లైఫ్​లో థ్రిల్​ ఉండాలి

రోజంతా ఒకేచోట కూర్చుని రొటీన్​ వర్క్​ చేసుకుంటూ పోవడం అస్సలు నచ్చదు. లైఫ్‌‌లో ఎగ్జైట్​మెంట్ ఉండాలి. రేపు ఏం జరుగుతుందో... అనే క్యూరియాసిటీ ఉండాలి. అప్పుడే లైఫ్​ థ్రిల్లింగ్​గా ఉంటుంది. అందుకే నా లైఫ్​లో ఎప్పుడు? ఏం జరగాలనే విషయం గురించి ఆలోచించను. ముందుగా ప్లాన్​ చేసుకోను. 

ఫేవరెట్ యాక్టర్స్​

నయనతార అంటే చాలా ఇష్టం.  నా ఇన్​స్టాగ్రామ్​లో నాలుగైదు ఫ్యాన్​ పేజీలు ఆమెవే ఉంటాయి. ఆమె నటనే కాకుండా తన రియల్​ లైఫ్​ కూడా ఇన్​స్పైరింగ్​గా ఉంటుంది. అందుకే ఆమె నా రోల్ మోడల్​. తమిళ హీరోల్లో ధనుష్​ అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ నేచురల్​గా ఉంటుంది” అంటూ బోలెడు కబుర్లు చెప్పింది. 

అమ్మ వల్లే ఇంతదాన్నయ్యా
ప్రతి అమ్మాయి వయసు రాగానే పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలి. జీవితాన్ని తన భర్తతో గడపాలి. కష్టం, సుఖం అన్నీ లైఫ్ పార్ట్​నర్​లోనే చూసుకోవాలి’’ అని చెప్తారు చాలామంది. కానీ, అది కరెక్ట్ కాదు. నన్ను మా అమ్మ ఒక్కతే పెంచి, పోషించింది. ఇప్పుడు మేం ఈ స్థాయిలో ఉన్నామంటే మా అమ్మే కారణం. మా అమ్మ ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. ఆడవాళ్లు ఒంటరిగా కూడా  లైఫ్​ని సక్సెస్​ఫుల్​గా లీడ్ చేయగలరని చెప్పడానికి.. ఇదొక్క ఉదాహరణ చాలు. ” అంది సంయుక్త.