టాలీవుడ్ యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన రామాంటిక్ డ్రామా చిత్రం' తెలుసు కదా' . సరికొత్త ప్రేమకథా మూవీలో అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో సిద్ధు సరసన రాఖీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. కానీ బాక్సాఫీస్ వద్ద అశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందనతో థియేటర్లలో రిలీజైన నెలరోజులు కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
నెట్ ఫ్లిక్స్ లో 'తెలుసుకదా'...
ఈ' తెలుసు కదా' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందుగా అనుకున్నా ప్రకారం నవంబర్ 23న స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే దీనిని పది రోజుల ముందుగానే రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే నవంబర్ 13 నుంచే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనితో ఈ మూవీ థియేట్రికల్ విండో నాలుగు వారాలకు పరిమితం కానుంది.
త్రికోణ ప్రేమ కథాంశంతో..
ఈ మూవీని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కోన నిరజ దర్శకురాలిగా వ్యవహరించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిచించింది. ఈ చిత్రం ఒక సాధారణమైన త్రికోణం ప్రేమ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. వరుణ్ ( సిద్ధు జోన్నలగడ్డ ) , అంజలి ( రాశీఖన్నా) ని పెళ్లి చేసుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో వరుణ తన మాజీ ప్రియురాలు రాగ ( శ్రీనిధి శెట్టి ) మళ్లి కలుసుకోవడం , వారి జీవితాలు క్లిష్టంగా మారడం ఈ సినిమా ప్రధాన అంశంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ అందించారు.
►ALSO READ | Lokesh Kanagaraj: హీరోగా లోకేష్ కనగరాజ్.. డెబ్యూతోనే బాలీవుడ్ క్రేజీ బ్యూటీ!
అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. సినిమా నిర్మాణంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. సిద్దు జొన్నలగడ్డ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఒక సాధారణ తెలుగు మూవీ ఫార్మాట్ కు భిన్నంగా ఆసక్తికరంగా , గందరగోళంగా ఉన్నప్పటికీ.. పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ. 8.18 కోట్లు మాత్రమే వసూలు చేసునట్లు టాక్ వినిపిస్తోంది.
