రజినీకాంత్ ‘కూలీ’, కమల్ హాసన్ ‘విక్రమ్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ని తెరకెక్కించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ తీసిన అరుణ్ మాథేశ్వరన్.. డైరెక్టర్ లోకేష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కు వెళ్లబోతోంది.
అయితే, ఇందులో లోకేష్‌కు జంటగా నటించబోయే హీరోయిన్స్ గురించి పెద్ద డిస్కసన్ నడుస్తుంది. ఇప్పటికే, లోకేష్ కోసం పలువురు క్రేజీ బ్యూటీస్ నటిస్తున్నట్లు టాక్ వినిపించింది. అందులో తెలుగు, తమిళ భాషల్లో పాపులర్ అయిన హీరోయిన్ 'మిర్నామీనన్' ఒకటి.
ఈ బ్యూటీ ఆది సాయికుమార్ ‘క్రేజీ ఫెలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అల్లరి నరేష్‌కు జంటగా ‘ఉగ్రమ్’లో నటించింది. ఆ తర్వాత.. ‘జైలర్’ రజినీకాంత్‌కు కోడలి పాత్రలో, నాగార్జున ‘నా సామిరంగా’లో నరేష్ లవర్గా కనిపించింది. ప్రస్తుతం ‘జైలర్ 2’లో నటిస్తోంది.
అలాగే, కన్నడ బ్యూటీ రచితా రామ్ పేరు కూడా మొన్నటివరకు వినిపించింది. ఈ భామ రీసెంట్గా కూలీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించి అదరగొట్టింది. ఈ క్రమంలోనే లోకేష్ సరసన నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఫైనల్గా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్.. లోకేష్ కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించినట్లు లేటెస్ట్ టాక్. తనే.. క్రేజీ బ్యూటీ వామికా గబ్బి. అలోమోస్ట్ ఈ బ్యూటీ ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
►ALSO READ | PriyankaChopra: భారీ కొండ చిలువలతో ప్రియాంక ఫోజులు.. ఈ మధ్యలోనే భర్తతో ఛమత్కారం, సరసం.. వీడియో వైరల్
వామికా గబ్బి సినిమాల విషయానికి వస్తే.. 2015లో హీరో సుధీర్ బాబు నటించిన "భలే మంచి రోజు" సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో వామికా కి టాలీవుడ్లో ఆఫర్లు రాలేదు. ఇక చేసేదేమీ లేక మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయింది. కానీ అక్కడ కూడా ఆఫర్ల విషయంలో ఇబ్బందులు పడింది.
ఈ క్రమంలో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ, అది హిట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే తెలుగులో అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి2) మూవీతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇప్పుడు ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలను టార్గెట్ చేసుకుని.. లోకేష్ సరసన నటిస్తున్నట్లు టాక్. త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే, డైరెక్టర్ లోకేష్.. హీరోగా డెబ్యూ ఇవ్వడం కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఫైట్స్, డ్యాన్స్ వంటి వాటి కోసం ఆయన తన బాడీ లాంగ్వేజ్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. లోకేష్ లాంటి స్టైలిష్ డైరెక్టర్.. హీరోగా కనిపిస్తుండు అంటే.. ఆడియన్స్కి ఆ కిక్కే వేరు.
ఇండస్ట్రీలో ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుదంటే..నేషనల్ వైడ్గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. అలాంటోడు హీరో అంటే.. నేషనల్ బాక్సాఫీస్కు.. మోత మోగినట్టే అని తన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి సినిమాతో వస్తాడో!
