PriyankaChopra: భారీ కొండ చిలువ‌ల‌తో ప్రియాంక ఫోజులు.. ఈ మధ్యలోనే భర్త‌తో ఛ‌మ‌త్కారం, స‌ర‌సం.. వీడియో వైరల్

PriyankaChopra: భారీ కొండ చిలువ‌ల‌తో ప్రియాంక ఫోజులు.. ఈ మధ్యలోనే భర్త‌తో ఛ‌మ‌త్కారం, స‌ర‌సం.. వీడియో వైరల్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. లేటెస్ట్గా తన ఇంస్టాగ్రామ్లో భారీ కొండ చిలువ‌తో ఫోజులిస్తూ ప్రియాంక చోప్రా చిల్ అయింది. ఈ ఫోటోలకు 'ఇక్కడ ఒక థీమ్ గమనించండి.. ఇది ssssssubtle" అని క్యాప్షన్ ఇస్తూ, ఫోటోలు, వీడియోలు పంచుకుంది. ఇందులో భర్త నిక్ జోనస్తో కలిసి, మెడలో కొండ చిలువను వేసుకొని ప్రియాంక నవ్వుతూ ఫోజులిచ్చింది.

అయితే, నిక్ జోనాస్ పాముకి దగ్గరగా రావడానికి సంకోచిస్తుండగా, పీసీ మాత్రం అలవోకగా పట్టుకుని తెగ ఎంజాయ్ చేస్తుంది. ఓ వీడియోలో నిక్ జోనాస్ ‘‘కొత్త ఆభరణాలను ప్రేమిస్తున్నాను బేబ్!’’ అని అనగా.. దానికి ప్రియాంక ‘థ్యాంక్స్.. ఇది సర్పెంటైన్’ అని బదులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ఛ‌మ‌త్కారం, స‌ర‌సం రెండు అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక కొండచిలువను మెడలోవేసుకున్న ఫోటోలకు కూడా విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. మెడలో భారీ కొండచిలువను వేసుకోవడం ఒక ఎత్తైతే, మరోవైపు ప్రియాంక మోడర్న్ బ్యూటీ అవతారంలో కనిపిపిస్తుండటం మరింత స్పెషల్గా మారింది. ఇందులో తెల్లటి టాప్ మరియు డెనిమ్ జీన్స్ ధరించి, జుట్టును స్టైలిష్ అప్‌డోలో పైకి లేపుతూ యూత్ని తెగ అట్ట్రాక్ట్ చేస్తుంది. దీంతో ‘డేరింగ్ క్వీన్’ అని, క్యూట్, హాట్ అంటూ లైక్ లు, కామెంట్లు ఊపందుకున్నాయి. 

గతంలోనూ ప్రియాంక ఇలా పాములను మెడలో వేసుకున్న ఫొటోలు సైతం చాలానే పోస్ట్ చేసింది. ఇందులో ఓ సంద‌ర్భంలో మెడలో పసుపు రంగు కొండచిలువను ధరించిన ఫోటోతో పాటుగా, నల్లటి భారీ పామును ప‌ట్టుకున్న ఫోటోగ్రాఫ్ కూడా పీసీ ఆల్బ‌మ్లో ఉన్నాయి. అలాగే, నాగుపామును కూడా అలవోకగా పట్టుకుని ప్రియాంక క‌నిపించింది. చివరగా జంగిల్ బుక్ అనే ఫొటోతో ఎండ్ చేసింది.

ఇక ఇవన్నీ ఒక్కసారిగా చూస్తుంటే.. ప్రియాంక ధైర్యసాహసాలకు కొదవే లేదన్నట్టుగా ఉంది. అందుకేనేమో.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫారెస్ట్ అడ్వెంచర్స్లో పీసీకి ఛాన్స్ ఇచ్చాడేమో! అనిపిస్తుంది. మరి ఈ SSMB29 ప్రాజెక్ట్లో ఇలాంటి సాహసాలే చేయనుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. 

ప్రియాంక చోప్రా సినీ విషయానికి వస్తే.. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు ప్రియాంకచోప్రా. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసి ఓ ఊపు ఊపేసింది. 2018లో అమెరికాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నికోలస్ జెర్రీ జోనాస్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఎక్కవగా హాలీవుడ్ పై దృష్టి సారించి స్టార్ డంను మరింత రెట్టింపు చేసుకుంది.

►ALSO READ | Mahesh Babu: రాకాశి అల‌లు ఎగ‌సిప‌డే చోట‌, మహేష్ ఆట.. అద్భుతమైన బస అంటూ సూపర్ స్టార్ పోస్ట్

అక్కడ ఓ వైపు నటిస్తూనే సినిమాలు, డాక్యుమెంటరీస్ నిర్మిస్తూ బిజీగా మారింది. దీంతో గ్లోబల్ బ్యూటీగా మారి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో నటిస్తుంది రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న SSMB 29లో కీలక పాత్ర పోషిస్తుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)