
పలు సూపర్ హిట్ చిత్రాలకు స్టైలిస్ట్‌గా వర్క్ చేసిన నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు నీరజ కోన మాట్లాడుతూ ‘నాకు స్కూల్ డేస్ నుంచి రైటింగ్ ఇష్టం. ఒక దశలో సినిమాకి కథ రాయగలననే నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో ఒకటి.. తెలుసు కదా. నేను సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయలేదు. దాదాపు వంద సినిమాలకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేశా. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అదే నా ఎక్స్‌పీరియెన్స్.. లెర్నింగ్ స్కూల్. ఈ కథను సిద్ధుకు చెప్పగానే సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చెప్పారు.
ఇదొక ట్రై యాంగిల్ లవ్ స్టోరీ. ఇందులోని మూడు క్యారెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ హానెస్ట్‌గా ఉంటూనే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ‘డీజే టిల్లు’ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ తర్వాత సిద్ధుకు కొత్త పాత్రలు చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. కానీ ఇందులో వరుణ్ పాత్రలో చాలా యూనిక్‌గా కనిపిస్తారు. రాగ అనే సంక్లిష్టమైన క్యారెక్టర్ చేసింది శ్రీనిధి. అలాగే అంజలి పాత్రలో రాశీ ఖన్నా చాలా అద్భుతంగా నటిచింది. తమన్ మ్యూజిక్ సినిమాకు బ్యాక్‌బోన్ లాంటిది. విశ్వ ప్రసాద్ గారి సపోర్ట్ మర్చిపోలేను. ఎక్కడ రాజీపడకుండా సినిమాని నిర్మించారు’ అని చెప్పారు.