
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి జరంత తగ్గింది. రాత్రి టెంపరేచర్లు సాధారణం కంటే 2 నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవు తున్నాయి. ఒక్క రోజులోనే నాలుగైదు డిగ్రీలు పడిపోయాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 8.8 డిగ్రీలు, రంగారెడ్డిలోని రెడ్డిపల్లిలో 9.1, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని గిన్నెదరిలో 9.2, ఆదిలాబాద్‌లోని అర్లి (టి)లో 9.5 డిగ్రీల మేర టెంపరేటర్లు నమోదయ్యాయి. ఈ నెల 27, 28 తేదీల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తక్కువ టెంపరేచర్లు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.