17 జిల్లాల్లో 42 డిగ్రీలపైనే టెంపరేచర్లు

17 జిల్లాల్లో 42 డిగ్రీలపైనే టెంపరేచర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైనే టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు రికార్డయ్యాయి. 17 జిల్లాల్లో 42 నుంచి 43 మధ్య, 9 జిల్లాల్లో 41 నుంచి 42 మధ్య టెంపరేచర్లు నమోదు కాగా.. వరంగల్​ జిల్లాలో 40 డిగ్రీల టెంపరేచర్  రికార్డయింది. అత్యధికంగా నిర్మల్​ జిల్లా నర్సాపూర్​లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జగిత్యాల జిల్లాలోని జైన, నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో 43.4, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 43.3, జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో 43.2, ఆదిలాబాద్​ జిల్లా అర్లిటిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక రాబోయే మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉక్కపోత, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 22 జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.