భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ.. ఖమ్మం జిల్లా కామేపల్లిలో  ..

భగత్ సింగ్ 95వ వర్ధంతి సభ పోస్టర్ ఆవిష్కరణ.. ఖమ్మం జిల్లా కామేపల్లిలో  ..

కామేపల్లి, వెలుగు:    అమరవీరుల వర్ధంతి సభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి రాకేశ్​ పిలుపునిచ్చారు.గురువారం కామేపల్లి మండల కేంద్రంలో విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్‌‌గురు, సుఖ్‌‌దేవ్  95వ వర్ధంతి సభలు,అమరవీరుల వర్ధంతి ఉత్సవాల  పోస్టర్లను  ఆవిష్కరించారు.  

మార్చి 23  నుంచి 30 వరకు పీవైఎల్, పీడీఎస్​యూ   తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం  నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశ స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయాలను గెలిపించడమే నేటి యువత ముందున్న ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.    

వారం రోజుల పాటు జరిగే ఈ పోరాట సభల్లో  విద్యార్థులు  పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేష్, మురళి, గోవర్ధన్, భూపతి, కళ్యాణ్ పాల్గొన్నారు.