బాల్కొండ ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి రిమాండ్

బాల్కొండ ఆలయాల్లో చోరీ చేసిన వ్యక్తి రిమాండ్

బాల్కొండ, వెలుగు : పలు ఆలయాల్లో చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపినట్లు భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ, కమ్మర్​పల్లి ఎస్సై అనిల్​రెడ్డి తెలిపారు. సీఐ, ఎస్సై వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి కి చెందిన తూర్పాటి కనకయ్య తరుచూ ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్నాడని తెలిపారు. మండలంలోని ఉప్లూర్ లో ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగిందని సదాశివ గౌడ్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి పట్టుకుని విచారించగా ఉప్లూర్ లో ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ, పోచమ్మ గుడి, ఏర్గట్ల మండలం తోర్తిలో దేవి, కమ్మర్​పల్లి లో గుండ్లకుంట హన్మాన్ గుడి లో  చోరీలకు పాల్పడినట్లు  ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుడి నుంచి రూ.2700, వెండి ఆభరణాలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తు చేసిన ఐడీ పార్టీ కానిస్టేబుల్ లు షౌకత్ అలీ, నవీన్ చంద్ర, వినయ్ లను భీంగల్ సీఐ పొన్నం సత్యనారాయణ  అభినందించారు.