
చంద్ర గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను మూసివేశారు పూజారులు. ప్రత్యేక పూజల తర్వాత ఆలయాలను బంద్ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంను మూసివేశారు. దీంతో పాటు అనుబంధ అలయాలను కూడా క్లోజ్ చేశారు. ఇవాళ రాత్రి ఒంటి గంట 24 నిమిషాల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని చెప్పారు పండితులు. రేపు ఉదయం గ్రహణం విడిచాక సంప్రోక్షణ, శుద్ది చేసి… ప్రత్యేక పూజలతో ఆలయాన్ని తెరుస్తామన్నారు పండితులు.