ఖైదీల విడుదలకు ‘దుబ్బాక’ బ్రేక్​!

ఖైదీల విడుదలకు ‘దుబ్బాక’ బ్రేక్​!
  • ఉప ఎన్నికలతో గవర్నర్​ దగ్గర ఆగిన క్షమాభిక్ష ఫైల్​

హైదరాబాద్​, వెలుగు: ఏండ్ల తరబడి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్న జీవిత ఖైదీల విడుదలకు తాత్కాలిక బ్రేక్​ పడింది. ఆమోదం కోసం గవర్నర్​ వద్దకు పంపిన క్షమాభిక్ష ఫైల్​.. దుబ్బాక ఉప ఎన్నికలతో అక్కడే ఆగిపోయింది. దీనిపై ఈసీ అనుమతి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి గవర్నర్​ ఆఫీసు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈసీ అనుమతి తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెబుతున్నారు. క్షమాభిక్షకు సంబంధించిన గైడ్​లైన్స్​తో పాటు దుబ్బాక నియోజకవర్గానికి చెందిన అర్హులైన ఖైదీల ఫైల్​నూ ఈసీకి అందించనున్నట్టు సమాచారం. గాంధీ జయంతి సందర్భంగా 143 మంది అర్హులైన ఖైదీలతో కూడిన ఫైల్​ను పోయిన నెల 29న సీఎం వద్దకు హోంశాఖ పంపించింది. అక్కడి నుంచి గవర్నర్​ ఆమోదం కోసం ఆ ఫైల్​ను పంపారు.