తాత్కాలిక డ్రైవర్ పొరపాటు.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తాత్కాలిక డ్రైవర్ పొరపాటు.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
  • 10 మందికి స్వల్ప గాయాలు 

పెద్దపల్లి టౌన్, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీ సడన్ ​బ్రేక్​వేయడంతో వెనుక నుంచి వస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి మండలం రంగంపల్లి వద్ద సోమవారం ఈ యాక్సిడెంట్ జరిగింది. గాయపడ్డ వారిని108 ద్వారా పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో బస్సు ముందుభాగం బాగా ధ్వంసమైంది. ఈ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్నారు. డ్రైవర్  పొరపాటు వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపించారు.

Temporary driver mistake.. RTC bus hits a lorry