
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు సమ్మెలో ఉండటం వల్ల తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధుల్లోకి తీసుకుంది ప్రభుత్వం. అనుభవం లేని ఈ డ్రైవర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సోమవారం ఓ తాత్కాలిక డ్రైవర్ తాగి బస్సు నడపడంతో ఆ బస్సు మరో RTC బస్సును ఢీకొట్టింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రహించిన ప్రయాణికులు.. అతడిని పట్టుకొని చితకబాదారు. ఇంతకు ముందు కూడా తాత్కాలిక డ్రైవర్ల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయి.