
మెదక్, వెలుగు: లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష , రూ.వెయ్యి జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.నీలిమ గురువారం (June 13) తీర్పు ఇచ్చారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపిన ప్రకారం.. రామాయంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 2వ తరగతి చదివే బాలిక వినాయక మండపం వద్ద ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తుంది.
2009 ఆగస్టు 27న అదే గ్రామానికి చెందిన రొయ్యల రాజు స్కూల్ సమీపంలోని ఖాళీ స్థలంలోకి బాలికను తీసుకెళ్లి నోట్లో గుడ్డ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడు రొయ్యల రాజు జైలు, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.