- అల్కరాజ్ జతగా డబుల్స్‌లో పోటీ
మాడ్రిడ్: ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడి నిరాశ పరిచిన స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రఫెల్ నడాల్ పారిస్‌లో మరోసారి సందడి చేయనున్నాడు. పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నాడు. తమ దేశానికి చెందిన యంగ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి ఒలింపిక్స్ డబుల్స్‌లో నడాల్ పోటీ పడతాడని స్పెయిన్ టెన్నిస్ ఫెడరేషన్ బుధవారం ప్రకటించింది.
21 ఏండ్ల అల్కరాజ్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి టైటిల్ నెగ్గాడు. అతని కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. కాగా, 38 ఏండ్ల నడాల్ 22 గ్రాండ్ స్లామ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గాడు. 2008లో సింగిల్స్ టైటిల్ నెగ్గిన అతను 2016లో మార్క్ లోపేజ్‌తో కలిసి డబుల్స్‌లో గోల్డ్ కైవసం చేసుకున్నాడు.
